
రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులన్నీ ఆలస్యమవుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో అయోమయంగా ఉందని చెప్పారు. డిజిటల్ మహానాడు రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. తన హయాంలో పులివెందులకు నీళ్లు ఇచ్చి చీనీ చెట్లను కాపాడామని రాయలసీమలో కరువు ఉండకూడదని చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో 8 లక్షల వ్యవసాయ కుంటలు తవ్వామన్నారు.