https://oktelugu.com/

వ్యాక్సిన్ కొనుగోలుపై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోళ్లపై బుధవారం సుప్రీం కోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి తెలిపింది. టీకాలు వేసిన జనాభా శాతం డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు టీకాలు వేసుకున్న జనాభా శాతాన్ని తెలపాలని కేంద్రానికి స్పష్టం చేసింది. కాగా వ్యాక్సినేషన్ పై కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ విధానం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 2, 2021 / 06:53 PM IST
    Follow us on

    కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోళ్లపై బుధవారం సుప్రీం కోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి తెలిపింది. టీకాలు వేసిన జనాభా శాతం డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు టీకాలు వేసుకున్న జనాభా శాతాన్ని తెలపాలని కేంద్రానికి స్పష్టం చేసింది. కాగా వ్యాక్సినేషన్ పై కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ విధానం సరిగా లేదని కొందరికే వ్యాక్సిన్ వేయడం సరికాదని పేర్కొంది.