
మహారాష్ట్రలోని బీమా కొరేగావ్ కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖా బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. తనకు బెయిల్ ఇచ్చేందుకు బొంబాయి హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా జస్టిస్ యుయు లలిత్, కెఎం జోసెప్ ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది. కాగా అంతకముందు మార్చి 26 న నవలఖా పటిషన్ పై తన తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది.