https://oktelugu.com/

Mahesh Babu : మరో రంగంలోకి అడుగుపెట్టబోతున్న మహేష్ బాబు? ఎందుకు?

మహేష్ బాబు కొత్తగా గ్రీన్ ఎనర్జీవైపు ప్రిన్స్ అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు మొత్తం సోలార్ విద్యుత్తుదే అని ఇప్పటికీ చాలా విషయం క్లారిటీ వచ్చేసింది. అందుకే ఆ వ్యాపారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట మహేష్ బాబు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 18, 2024 / 03:13 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తగిన విధంగా శిక్షణ తీసుకుంటున్నాడు. గత కొన్ని సినిమాల నుంచి మహేష్ బాబును ఒకే లుక్ లో చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు రాజమౌళి కొత్త మహేష్ బాబును చూపించబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రం బడ్జెట్ రూ.1500 కోట్ల వరకు ఉంటోంది. హాలీవుడ్ హీరోయిన్ నవోమీ స్కాట్ కథానాయికగా నటించబోతోంది. సంక్రాంతికి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు పంచుకోనున్నారు రాజమౌళి. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈలోగా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

    అయితే ఈ ఖాళీ సమయంలో ఖాళీగా ఉండకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మహేష్ బాబు తన పనులు చేసుకుంటున్నారని టాక్. రాజమౌళి సినిమా అంటే కనీసం మూడు సంవత్సరాలు కేటాయించాలి. రెండు భాగాలుగా సినిమా వచ్చే అవకాశం ఉంది. ఈలోగా కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ఏఎంబీ మాల్స్ హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. విశాఖలో త్వరలో రాబోతోంది. హైదరాబాద్ లో రెస్టారెంట్ బిజినెస్ ఉంది. నమత్రా శిరోద్కర్ చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ మించి కొత్తగా గ్రీన్ ఎనర్జీవైపు ప్రిన్స్ అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు మొత్తం సోలార్ విద్యుత్తుదే అని ఇప్పటికీ చాలా విషయం క్లారిటీ వచ్చేసింది. అందుకే ఆ వ్యాపారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట మహేష్ బాబు.

    ట్రూజన్ సన్ టెక్ కంపెనీతో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు ది సూపర్ స్టార్ మహేష్ బాబు. దీనికోసం కొన్ని కోట్లరూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. ట్రూజన్ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటన కూడా మహేష్ బాబు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దీంతోపాటు ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సోలార్ విద్యుత్తుతో నింపేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ట్రూజన్ కంపెనీతో కలిసి మహేష్ బాబు ఏ రాష్ట్రంలో ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారనే విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడి కాబోతోందంటున్నారు.

    మొత్తం మీద సినిమాలు, వ్యాపారాలు అంటూ మహేష్ బాబు చాలానే సంపాదిస్తున్నారు అనడానికి ఇది మరొక నిదర్శనం. సంపాదన పక్కన పెడితే ఈయన పిల్లలు రత్నాలు అంటారు కొందరు. మహేష్ బాబు ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్ లు చేయించారు. పిల్లలను ఆదరిస్తాడు. ఇలాంటి మంచి మనసున్న కూతురు సితార కూడా తన మంచి మనసును చాటుతుంటుంది. మొత్తం మీద ఫ్యామిలీ మొత్తం కూడా సూపర్ అనే ముద్ర వేసుకున్నారు. మరి ముందు ముందు ఎస్ఎస్ఎంబీ 29తో రాబోతున్న ఈ సూపర్ స్టార్ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.