
సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ శనివారం పోటీ పడుతున్నాయి. వరుస ఓటములతో సతమతవుతున్న సన్ రైజర్స్ విజయం కోసం చూస్తోంది. అలాగే గెలుపు అంచుల దాకా వెళ్లి చివర్లలో బోల్తా పడుతున్న పంజాబ్ ఈసారి ఎలాగైన గెలవలని పట్టుదలగా ఉంది. పంజాబ్ జట్టులో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. గత మ్యాచ్ లోనూ రాజస్థాన్ పై శతక భాగస్వామ్యం జోడించి జట్టుకు శుభారంభం అందించారు.
దీన్ని బట్టే వీరు ఎలా ఆడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అియతే ఇద్దరిలో ఒకరు చివరి వరకూ క్రీజులో నిలబడితే పంజాబ్ మరింత స్కోరు సాధించే అవకాశం ఉంది. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్ లో క్రిస్ గేల్ ఫర్వాలేదనిపిస్తున్నా గత మ్యాచ్ లో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మరో వైపు డిల్ ఆర్డర్ లో నికోలస్ పూరన్, మార్ క్రమ్ బాగా ఆడినా చివర్లో ఒత్తిడికి గురై విఫలమయ్యారు.
ఈ సీజన్ లో అత్యంత పేలవ ప్రదర్శనతో కొనసాగుతున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. తొలి దశల అదరగొట్టిన జానీ బెయిర్ స్టో ఇప్పుడు వ్యక్తిగత కారణాలో దూరమయ్యాడు. మరో వైపు డేవిడ్ వార్నర్ పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇక తర్వాత వచ్చే కెప్టెన్ విలిమన్స్, మనీవ్ పాండే చేసే పరుగులే ఆ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందిస్తున్నాయి. ఇక బౌలింగ్లో రషీద్ ఖాన్ ఒక్కడే రాణిస్తున్నాడు. ఇకనైనా భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, జేసర్ హోల్డర్ లాంటి ఆటగాళ్లు జట్టు విజయాలకు కృషి చేయాలి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఇప్పటి వరకు ఒక్క విజయం మాత్రమే సాధించగా.. పంజాబ్ మూడు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది.