
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ దృష్ట్యా నాలుగు రోజుల ముందుగానే వేసవి సెలవులు ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయించారు. క్యాలెండర్ ప్రకారం మే 14 నుంచి సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు. కానీ బార్ అసోసిమేషన్ సభ్యుల వినతి మేరకు మే 10 నుంచి జూన్ 28 వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.