Stock Markets: భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 953 పాయింట్ల నష్టంతో 80,738 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 283 పాయింట్ల నష్టంతో 24,603 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు, చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ సూచీలు నెగటివ్ గా స్పందిస్తున్నాయి. ఎల్ఆండ్ టీ, అదానీ పోర్ట్స్, ఇన్పోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాబ్ ఫిన్ సర్వ్, ఎంఅండ్ఎం,ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టాల్లో కదలాడుతున్నాయి.