
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9.27 సమయంలో సెన్సెక్స్ 268 పాయింట్ల లాభంతో 56,060 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16,686 వద్ద ట్రేడవుతున్నాయి. కీలక రంగాల సూచీలు మొత్తం సానుకూలంగానే ఉన్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్ రంగ సూచీ 0.85 శాతం లాభంతో కొనసాగుతోంది. డాలర్ తో రూాపాయి మారకం విలువ స్పల్పంగా తగ్గి రూ. 74.05 వద్ద ట్రేడ్ అవుతోంది.