
దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాల్లో ముగిశాయి. రెండు ప్రధాన సూచీలు జీవితకాల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ తొలిసారి 16వేల మార్క్ ను దాటింది. ఓ దశలో సెన్సెక్స్ 937 పాయింట్లు లాభాపడి 53,887 వద్ద, నిఫ్టీ 261 పాయింట్లు ఎగబాకి 16,146 వద్ద జీవిత కాల గరిష్టాలను తాకాయి. చివరకు సెన్సెక్స్ 872 పాయింట్లు లాభపడి 53,823 వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 16,130 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.26 వద్ద స్థిరపడింది.