Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలతో సూచీలు రాణించాయి. ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు, విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోలు దారులుగా నిలవడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 800 పాయింట్లు మేర రానించింది. సెన్సెక్స్ ఉదయం 81,196.08 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రాణించిన సూచీ ఇంట్రాడేలో 81,911.13 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 443 పాయింట్ల లాభంతో 81,442 వద్ద ముగిసింది.