Mallu Ravi: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవిపై సొంత పార్టీ నేతలే అధిష్టానికి ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుతో సన్నిహితంగా ఉంటున్నారని, ఆ పార్టీ పెండింగ్ బిల్లులు ఇప్పిస్తు 10శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏడాదిగా కాంగ్రెస్ ను పట్టించుకోవట్లేదని అన్నారు.