
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 268 పాయింట్ల లాభంతో 52,654 వద్ద.. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 15,771 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74,52 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గత వారాన్ని లాభాలతో ముగించాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. దేశీయంగా బ్యాంకింగ్, స్థిరాస్తి, లోహ, మౌౌలిక రంగాలు రాణిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల బాట పట్టాయి.