https://oktelugu.com/

CM Revanth : ‘‘అన్నా.. వదిన’’.. మంత్రి శ్రీధర్ బాబును ఆటపట్టించిన రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ కు స్వాగతం పలకగా 'అన్నా.. వదిన" అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు. 'ఫొటో బాగా దిగండి' అని మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం నవ్వులు పూయించారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 21, 2024 / 10:48 AM IST

    Sridhar Babu's wife Sailajaramaiyar welcomed CM Revanth

    Follow us on

    CM Revanth : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వేములవాడకు విచ్చేసిన రేవంత్ రెడ్డికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుమారు గంటన్నరపాటు రాజన్న ఆలయ పరిసరాల్లోనే బస చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌తో కలిసి వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

    రేవంత్ వేములవాడ పర్యటన క్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సతీమణి శైలజారామయ్యార్ వచ్చారు. మంత్రులకు స్వాగతం పలికారు. తన భర్త శ్రీధర్ బాబుకు సైతం ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం చెప్పారు. సీఎం రేవంత్ కు స్వాగతం పలకగా ‘అన్నా.. వదిన” అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు. ‘ఫొటో బాగా దిగండి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం నవ్వులు పూయించారు.

    కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుడి చెరువు మైదానంలో జరిగిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కేసీఆర్ కుటుంబ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల కోసం ప్రాజెక్టులు కట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం మల్లన్న సాగర్, హరీశ్ రావు ఫాంహౌస్ వద్ద రంగనాయక సాగర్ నిర్మించారని తెలిపారు. జన్వాడ లో కేటిఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆ ముగ్గురి లెక్క తెలుస్తామని స్పష్టం చేశారు.

    ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో.. రైతులకు ఎన్ని లక్షల రుణాలు మాఫీ చేశారో, పది నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, ఎన్ని లక్షలు ఇచ్చారో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశాం. గత పదినెలల్లో 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇక ఐదేళ్లలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు విడతల్లో 11 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25 రోజుల్లో 18 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిందన్నారు. నిజం ఒప్పుకునే ధైర్యం కేసీఆర్‌కు ఉంటే అసెంబ్లీకి వచ్చి ఎవరి హయాంలో ఏం జరిగిందో తేల్చుకోవాలని సవాల్ విసిరారు.