
రష్యా టీకా స్పుత్నిక్-వి ని భారత్ లో ఉత్పత్తి చేసి పంపిణి చేసేందుకు గాను హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి వాక్సిన్ యొక్క మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ను భారత్ లో నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. రష్యా ప్రభుత్వం సెప్టెంబర్ 1న మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించగా దాదాపు 40 వేల వలంటీర్లు ఈ పరీక్షల్లో పాలుపంచుకుంటున్నారు.