England vs South Africa : “ఒత్తిడిని తట్టుకోలేరు. బలమైన బ్యాటింగ్.. భీకరమైన బౌలింగ్.. చురుకైన ఫీల్డింగ్ ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కీలక దశలో చేతులెత్తేస్తారు. ఏమాత్రం ఎదురీతను వారు ప్రదర్శించలేరు.. అందుకే వారికి చోకర్స్ అనే పేరు ఉంది” 2024 లో పొట్టి వరల్డ్ కప్ కోల్పోయిన తర్వాత అంతర్జాతీయ మీడియాలో కనిపించిన ఓ కథనానికి అనువాదం అది. దానికి తగ్గట్టుగానే దక్షిణాఫ్రికా ఆట తీరు ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇటీవల కంగారు జట్టుతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో సఫారి జట్టు విజయం సాధించింది. చివరి వరకు నిదానంగా ఆడి.. సమ యోచితంగా పరుగులు తీసి విజయాన్ని అందుకుంది. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో ఐసీసీ నిర్వహించిన మేజర్ టోర్నీకి సంబంధించిన ట్రోఫీ అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. దీతో దక్షిణాఫ్రికా జట్టు మారింది. ఆట తీరు మారింది అని అందరూ అనుకున్నారు. దీనికి తోడు ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ను గెలుచుకొని.. విమర్శకుల నోటికి తాళం వేసింది. అయితే అదంతా తాత్కాలికమని.. దక్షిణాఫ్రికా ఆట తీరు ఏమాత్రం మారలేదని తాజా మ్యాచ్ నిరూపించింది. అంతేకాదు దక్షిణాఫ్రికా జట్టు ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేదని మరోసారి బయటపడింది.
సౌత్ అంప్టన్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఏకంగా 342 పరుగుల భారీ వ్యత్యాసంతో ఓటమిపాలైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇది అతి ఘోరమైన ఓటమి. అంతటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి జట్లు కూడా ఈ స్థాయిలో ఘోరమైన ఓటమిని నమోదు చేయలేదు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 415 పరుగులు చేసింది. ఆ టార్గెట్ ఫినిష్ చేయడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. సీరియస్ గెలిచామని ఆనందంలో వికెట్లు పడేసుకున్నారు. ఫలితంగా చరిత్రలో తొలిసారిగా దారుణమైన ఓటమిని నమోదు చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ప్లేయర్లలో భాష్ చేసిన 20 పరుగుల టాప్ స్కోర్ అంటే.. వారి బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా దక్షిణాఫ్రికా ప్లేయర్లు 72 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా 4 వికెట్లు తీశాడు.. 72 పరుగులకే కుప్పకూలడం ద్వారా వన్డే చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని దక్షిణాఫ్రికా జట్టు నమోదు చేసింది.