Sourav Ganguly: గతంలో భారత టెస్టు కెప్టెన్సీ మార్పు పై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టెస్టు సారథిగా కంటిన్యూ అవ్వాలని కోహ్లీని అడిగాం. కానీ అతడు ఒప్పుకోలేదు. దీంతో వన్డేలకు, టీ20లకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను టెస్టు కెప్టెన్సీ చేయాలని కోరగా పని భారంతో తొలుత అతడు అంగీకరించలేదు. కోహ్లీనే కంటిన్యూ చేయాలని చెప్పాడు. నేను రోహిత్ శర్మతో మాట్లాడి ఒప్పించాను గంగూలీ తెలిపాడు.