https://oktelugu.com/

సోపార్ ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లోని సోపార్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు సంభవించాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. సోపార్ పట్టణంలోని నాతిపురా గోసియా కాలనీలో ఉన్న ఇళ్లలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ కలిసి సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా టెర్రరిస్టులను లొంగిపోవాలని కోరినప్పటికీ వారు స్పందించకపోగా, సైన్యం పై కాల్పులు ప్రారంభించారని జమ్ము పోలీసులు […]

Written By: , Updated On : May 5, 2021 / 09:33 AM IST
Follow us on

జమ్ముకశ్మీర్ లోని సోపార్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు సంభవించాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. సోపార్ పట్టణంలోని నాతిపురా గోసియా కాలనీలో ఉన్న ఇళ్లలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ కలిసి సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా టెర్రరిస్టులను లొంగిపోవాలని కోరినప్పటికీ వారు స్పందించకపోగా, సైన్యం పై కాల్పులు ప్రారంభించారని జమ్ము పోలీసులు తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు.