Homeక్రీడలుsnake in pakistan dugout : పాక్ డగ్ ఔట్ లో పాము.. ఇప్పటికైనా అర్థమైందా...

snake in pakistan dugout : పాక్ డగ్ ఔట్ లో పాము.. ఇప్పటికైనా అర్థమైందా భారత్ ఎంత గ్రేటో!

snake in pakistan dugout : అది శ్రీలంకలోని కొలంబో నగరం. అక్కడి ప్రేమ దాస మైదానంలో టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రేక్షకులు భారీగా రావడంతో ఆ మైదానం మొత్తం కిటకిటలాడిపోతోంది.

ప్రేమ దాస మైదానం ఎంతో చరిత్ర కలిగి ఉన్న క్రికెట్ గ్రౌండ్. ఇది శ్రీలంకలో అత్యంత ప్రముఖమైన క్రికెట్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ గతంలో బాగుండేది. ముఖ్యంగా శ్రీలంక దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకోకముందు ఈ మైదానం లో సకల సౌకర్యాలు ఉండేవి. ఎప్పుడైతే శ్రీలంక ప్రభుత్వం ఆర్థికంగా చతికిల పడిందో.. శ్రీలంక క్రికెట్ బోర్డు లో ఆర్థిక స్థిరత్వం లోపించిందో.. అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి.

ప్రేమ దాస క్రికెట్ గ్రౌండ్ నిర్వహణ అధ్వానంగా మారింది. దీనికి తోడు ఇక్కడ పాముల బెడద పెరిగిపోయింది. తాజాగా పాకిస్తాన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ మైదానంలో పాము కనిపించింది. అది కూడా పాకిస్తాన్ డగ్ అవుట్ లోనే కనిపించడం విశేషం..

ఆ పాము దాదాపు 6 అడుగుల పొడవు ఉంది. డగ్ అవుట్ లో పాము కనిపించడంతో వెంటనే స్టేడియం సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాములు పట్టే వ్యక్తులను పిలిపించారు. అతి కష్టం మీద ఆ పామును పట్టుకున్నారు. ఆ తర్వాత ఒక కవర్లో వేసి.. ప్యాక్ చేసి.. సమీపంలో ఉన్న అడవిలో పడేశారు…

“భారతదేశంలో ఎన్నో మైదానాలు. పర్వత ప్రాంతాలలో కూడా అద్భుతమైన క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఎన్నడూ కూడా ఇలా పాములు వచ్చిన ఘటనలు చోటు చేసుకోలేదు. టీమిండియాలో ఆటగాళ్లకు భద్రతపరంగా డోకా ఉండదు. కానీ నెత్తి మాసిన పాకిస్తాన్ కు భారతదేశం ఘనత తెలియడం లేదు. అందువల్లే తటస్థ వేదికల్లో ఆడాలని కోరుకుంటున్నది. తటస్థవేదికలో సరైన సదుపాయాలు ఉండవు. కనీసం ఉండే హోటల్ కూడా అధ్వానంగా ఉంటుంది. అలాంటప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లకు ఇటువంటి శాస్తి జరగాల్సిందేనని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular