
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,53,745 కరోనా టెస్టులు చేస్తే 37,875 మందికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో 369 మంది చనిపోయారు. మొత్తం కేసులు 3,30,96,718కు చేరగా 4,41,411 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 39,114 మంది కరోనా నుంచి కోలుకున్నాు. దేశంలో ప్రస్తుతం 3,91,256 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 70.75 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.