
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కేసులు వెలుగు చూడగా.. మరణాల సంఖ్య 500 లోపే నమోదైంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో 493 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,31,225కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా 37,927 మంది కరోనాను జయించగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కి చేరింది.