
ఏపీలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో 12,749 మంది కోలుకున్నారు. 73 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసులు 12,45,374కు పెరిగాయి. 10,50,160 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,86,695కు చేరాయి. 8519 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో లక్షా 424 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.