
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 59,641 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1546 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారిసంఖ్య 19,70008కి చేరింది. మరోవైపు 1968 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా 15 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,410కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి.