
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,970 పరీక్షలు నిర్వహించగా 1,178 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20,23,242 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్ కేసులు ఉన్నాయి.