
సినీనటి కరాటే కల్యాణి భాజపాలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో మాజీ ఎంపీ విజయశాంతి సమక్షంలో కరాటే కల్యాణికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాజపా కండువా కప్పి ఆహ్వానించారు. కరాటే కల్యాణితో పాటు ఆమె అనుచరులు పది మందిపార్టీలో చేరారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కల్యాణి తెలిపారు.