PM Modi Bhopal Visit: ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ లో పలువురు మహిళా అధికారులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీ గల్లంతు చేశారని మోదీ కీర్తించారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్ లో నిర్వహించిన మహిళా స్వశక్తి కరణ్ మహా సమ్మేళన్ లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల చేశారు. ఉగ్రవాదులే కాదు వారిని పోషించేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని అన్నారు.