Simran Sharma Inspirational Athlete : జీవితంలో ఏదైనా సాధించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అనుకుంటూనే ఉంటారు.. అందుకు తగ్గ కృషి చేయరు.. ఎందుకంటే తమకు ఏవేవో సమస్యలు ఉన్నాయని.. ఆ సమస్యలు పరిష్కారం అయితే ఆ తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తామని అనుకుంటారు. కానీ అంగవైకల్యం సైతం ఉన్నవారు కొన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఒలంపిక్స్ వరకు వెళ్లలేని వారు.. నడక కూడా సాధ్యం కానీ ఒక అమ్మాయి పారా ఒలంపిక్స్ లో కి వెళ్లి భారతదేశానికి రజిత పతకం తీసుకువచ్చింది. ఇందుకుగాను ఆమెను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అయితే ఆమె పారా ఒలంపిక్స్ వరకు వెళ్లడానికి పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒక రకంగా ఆమె జీవిత చరిత్ర చదివితే కన్నీళ్లు కూడా వస్తాయి. మరి ఇంతకు ఆమె ఎవరు? ఆమె జీవిత చరిత్ర ఏంటి?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా మోదీ నగర్ లో 1999లో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరు సిమ్రాన్ శర్మ. యితే ఆమె ఆరున్నర నెలలకే జన్మించడంతో ఆమెకు దృష్టిలోపం ఏర్పడింది. దీంతో కొన్ని నెలల పాటు ఆమెను ఇంక్యుబేటర్లు ఉంచాల్సి వచ్చింది. చిన్నప్పుడే దృష్టిలోపం ఉండడంతో పాటు సరిగ్గా నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని చూసి చాలామంది ఆమెను అవహేళన చేశారు. అంతేకాకుండా ఆమె కుటుంబ పరిస్థితి కూడా ఆర్థికంగా తక్కువగా ఉండడంతో జీవితం కష్టంగా మారేది. కానీ తనకు దృష్టిలోపం ఉన్న కారణంగా క్రీడల్లో రాణించాలన్న తపన ఉండేది. దీంతో ఆమె ఇంటర్ చదువుతున్న సమయంలో క్రీడారంగంలో రాణించడానికి ప్రయత్నించారు. అయితే అందుకు తగ్గ ఆర్థిక పరిస్థితులు లేకపోవడంతో నిరాశ చెందేది.
సిమ్రన్ శర్మ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆర్మీ జవాన్ అయినా గజేంద్ర సింగ్ ఆమెను ప్రోత్సహించారు. ఆమెకు అవసరమైన కోచింగ్ ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం చేశారు. దీంతో అప్పటినుంచి పరుగు మొదలు పెట్టిన సిమ్రన్ శర్మ ఆ తర్వాత పారా ఒలంపిక్ వరకు వెళ్ళింది. 2021 వ సంవత్సరంలో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఆమె పతకం సాధించలేకపోయింది. అయినా కూడా పట్టు విడవకుండా మళ్ళీ ప్రయత్నించింది. చివరకు 2024 వ సంవత్సరంలో పారా ఒలంపిక్స్ లో పాల్గొన్న ఆమె వెండి పతకంను గెలుచుకుంది. ఈమె పతకం గెలుచుకోవడమే కాకుండా.. ఆమె కష్టాల గురించి తెలుసుకున్న భారత ప్రభుత్వం..సిమ్రన్ శర్మను అర్జున అవార్డుతో సత్కరించింది.
అంగవైకల్యం ఉంటే తాము ఎందుకు పనికి రాము అని అనేవారికి..సిమ్రన్ శర్మ జీవితం ఒక స్ఫూర్తిదాయకం. అంతేకాకుండా చాలామంది యువత తమ జీవితాన్ని సరైన గాడిలో పెట్టేందుకు ఈమె ఆదర్శంగా నిలుస్తుంది. ఇక సిమ్రన్ శర్మ ను ప్రోత్సహించిన గజేంద్ర సింగ్ 2017 వ సంవత్సరంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా సిమ్రన్ శర్మ ఎన్నో రకాల విజయాలు సాధించింది.