Silver Price Prediction : ఖరీదైన లోహాల గురించి ప్రస్తావన వస్తే ముందు వరుసలో ఉంటుంది బంగారం. పైగా ఇటీవల కాలంలో బంగారం ధర అంతకుమించి అనే స్థాయిలో పెరిగిపోతుంది. ఇది ఎక్కడదాకా వెళ్తుందో తెలియడం లేదు కానీ.. ప్రస్తుతానికి అయితే ధర తారాజువ్వలాగా ఆకాశంలో ప్రయాణం చేస్తోంది. ఒకప్పుడు తులం బంగారం ధర 50 నుంచి 60 వేల మధ్యలో ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా 1,20,000 మార్కును దాటిపోయింది. లక్ష రూపాయలకు తులం అంటేనే చాలామంది నోర్లు వెళ్లబెట్టారు. కానీ ఇప్పుడు లక్ష 50 వేల వరకు వెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొందరేమో ధర తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈ ఊగిసలాట మధ్య మరో చర్చ కూడా మొదలైంది.
బంగారమే అత్యంత ఖరీదైన లోహం అనుకుంటే.. ఇప్పుడు దానిని మించిపోయేలా ఉంది వెండి. ఒకప్పుడు వెండికి అంతగా డిమాండ్ గా ఉండేది కాదు. కిలో ధర మహా అయితే 20 నుంచి 40 వేల మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు రెండు కిలో ధర లక్ష రూపాయలను మించిపోయింది. అంతేకాదు ధరలో బంగారంతో పోటీపడుతోంది. గడిచిన ఏడాదిలోనే వెండి ధర ఏకంగా 54 శాతం పెరిగింది. పారిశ్రామిక రంగంలో వెండిని విపరీతంగా వినియోగిస్తున్నారు. సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో వెండికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది ఇలాగే ఉంటే వెండి కిలో ధర 2 లక్షలకు చేరుకుంటుందని, వచ్చే ఐదేళ్లలో మూడు లక్షల బాగా వెళుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లు కూడా బంగారం పై కంటే వెండి మీద ఎక్కువ పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. సౌర విద్యుత్ తయారీలో వెండి కి విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. అందువల్లే వెండిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్యానెల్స్ నిర్మాణంలో వెండికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్లే వెండి ధర విపరీతంగా పెరుగుతుంది. వచ్చే మూడు సంవత్సరాలలో బంగారానికి డిమాండ్ తగ్గిపోతుందని.. ఇదే సమయంలో వెండికి గిరాకీ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.. “ఒకప్పుడు వెండికి అంతగా గిరాకీ ఉండేది కాదు. పారిశ్రామిక అవసరాలు పెరిగిపోయాయి. సౌర విద్యుత్ ఫలకాల తయారీలో వెండి వినియోగం ఎక్కువైంది. అందువల్లే ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. భవిష్యత్తు కాలంలో ధర మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని” నిపుణులు పేర్కొంటున్నారు.