
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 284 మంది అభ్యర్థలు పోటీ పడుతున్నారు. ఈ దశలో పోలింగ్ లో 86 లక్షల మంది ఓటర్లు ఓట హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్ లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.