
ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ అనే వస్తోందని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్టుల ఫలితాలు వచ్చే వరకూ ఎవరరూ ఆగవద్దని అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఈటల కోరారు. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయని, నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లోొ ఆక్సిజన్ కొరత లేదని 80 టన్నుల ఆక్సిజన్ ను తెప్పిస్తున్నామని వెల్లడించారు.