
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆగస్టు 16లోపు ఉపాధ్యాయులకు 100 శాతం వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. రెండో విడత విద్యాకానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నాడు-నేడు ఫేజ్-2 తో స్కూళ్లు రూపురేఖలు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అమ్మ ఒడి, వసతి దీవెన వద్దనుకుంటున్నవారికి వచ్చే ఏడాది నుంచి ల్యాప్ టాప్ లు అందిస్తామని ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.