
మాజీ మంత్రి ఈటల రాజేందర్ జోలికొస్తే సీఎం కేసీఆర్ గడీలు బద్దలు కొడుతామని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారులకు ఏకైక వేదిక బీజేపేనని పేర్కొన్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని సంజయ్ ప్రకటించారు. కేసీఆర్ ను ఎదర్కొనే దమ్ము బీజేపీకే ఉందని స్పష్టం చేశారు.