https://oktelugu.com/

Sammelanam Webseries Review : ‘సమ్మేళనం ‘ వెబ్ సిరీస్ సిరీస్ రివ్యూ…

Sammelanam Webseries Review : ఈటీవీ విన్ లో 'సమ్మేళనం' అనే సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written By: , Updated On : February 21, 2025 / 08:52 PM IST

Sammelanam Webseries Review

Follow us on

Sammelanam Webseries Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా కొత్త కాన్సెప్ట్ తో మంచి సినిమాలు వస్తున్నాయి. ఇక వాటికి ఏ మాత్రం తగ్గకుండా సీరీస్ లు సైతం ఓటిటి ప్లాట్ ఫామ్ మీద సందడి చేస్తుండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈటీవీ విన్ లో ‘సమ్మేళనం’ అనే సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే ఒక ఊర్లో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి జాలిగా తమ లైఫ్ ను లీడ్ చేస్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడుపుతుంటారు. ఇక సడన్ గా వాళ్ళ లైఫ్ లోకి మేఘన అనే ఒక అమ్మాయి వస్తుంది. ఇక ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వీళ్ళలో వీళ్ళకే చాలా గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. మొత్తానికి వీళ్ళందరూ మళ్ళీ కలిసారా ఎందుకు గొడవలు జరిగాయనే విషయాలు తెలియాలంటే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ ఈ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా మలిచాడు. ముఖ్యంగా కథ రొటీన్ గా సాగినప్పటికి దీంట్లో మాత్రం చాలా వరకు సినిమాలోని ప్రతి సీన్ ను చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నమైతే చేశాడు… ప్రతి సీన్ లో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉండేలా చూసుకున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా సిరీస్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఎమోషనల్ గా కూడా చాలా బాగా కనెక్ట్ చేసుకుంటూ రాసుకున్న రైటింగ్ అయితే చాలా బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది… బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే కొన్ని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సిరీస్ లో చేసిన ప్రతి ఒక ఆర్టిస్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ముఖ్యంగా ప్రియ వడ్లమాని ఒక్కరిని వదిలేస్తే మిగిలిన ఆర్టిస్తులందరు కూడా కొత్త వాళ్లే కావడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా నటించి మెప్పించారు. ఇక దర్శకుడు సైతం కొత్త డైరెక్టర్ అయినప్పటికి ఎక్కడ కూడా తడబకుండా సీన్ లో ఉన్న ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన విధానం అయితే చాలా ఎక్స్ట్రాడినరిగా ఉంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రియా వడ్లమాని ఓకే అనిపించారు. ఆమె ఈ సిరీస్ లో చాలా బాగా నటిస్తూ తన పాత్ర పరిది మేరకు అందులో ఇన్వాల్వ్ అవుతూ ముందుకైతే తీసుకెళ్లారు. మరి మొత్తానికైతే ఆమె పాత్ర సినిమాకి చాలా వరకు హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి… ఇక మిగతా ఆర్టిస్టులందరు కొత్తవాళ్లు అయినప్పటికి వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడ తడబడకుండా వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సిరీస్ కి మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే చెప్పాలి… విజువల్స్ విషయానికి వస్తే చాలా టాప్ నాచ్ విజువల్స్ అందించారు. ఇక సిరీస్ చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేస్తు చేస్తున్నారంటే అందులో విజువల్స్ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

డైరెక్షన్
ఎమోషనల్ సీన్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కొన్ని ఎపిసోడ్స్ స్లో నేరేషన్ తో సాగాయి…

రేటింగ్

ఇక ఈ సీరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2.75/5