
హైదరాబాద్ నగరంలో బ్లాక్ లో ఆక్సిజన్ సిలిండర్ల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ కు రూ. 25 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మినీ వ్యానులో అక్రమంగా సిలండర్లు తరలిస్తుంగా పోలీసులు పట్టుకున్నారు. వ్యానుతో పాటు 5 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేశారు. మాస్ ఫౌండేషన్ ఎన్టీవో పేరుతో ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్నారు. అలాగే రోగులకు అంబులెన్స్ ల ఏర్పాటు ముసుగులో దందాను నిర్వహిస్తున్నారు.