
వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఎలా వేధించాలో చంద్రబాబుకు బాగా తెలుసని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని ఆయన వ్యాఖ్యానించారు. దేవినేని, కోడెల, అచ్చెన్నపై ఉన్న కేసుల్ని కొట్టేసుకున్నారని సజ్జల తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసులను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. 2019 కోడ్ వచ్చేలోగా ఉన్న కేసుల్ని కొట్టివేయించుకున్నారని సజ్జల చెప్పారు.