
టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు లేఖలో అన్నీ అబద్దాలేనని కొట్టిపారేశారు. ప్రభుత్వంపై ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారని, టీడీపీ హయాంలోని బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.