టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. హీరో తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అధికారులు. రోడ్ల మీద వ్యర్థాల ను వేస్తున్న వారిపై కొరడా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే మాదాపూర్ ఖానామెట్ లో నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్ర్సక్షన్ కంపెనీ కి లక్ష రూపాయల జరిమానా విధించారు.