
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ ఎస్ 1,475 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగవత్ కు 4, 228 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ఏర్పాటు చేశారు.