
రోహిత్ శర్మ (50) అర్ధ శతకం సాధించాడు. ఈ ఓవర్ కు ముందు 41 పరుగులతో ఉన్న అతడు సామ్ కరన్ వేసిన 38వ ఓవర్ లో వరుసగా రెండు బౌండరీలు ఒక సింగిల్ బాదాడు. దాంతో రోహిత్ 125 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇదే ఓవర్ లో పుజరా (26)తో కలిసి అర్ధశతక భాగస్వామ్యం కూడా పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా 38 ఓవర్లకు 89/1 తో నిలిచింది. ఇంకా 265 పరుగుల వెనుకంజలో ఉంది.