
టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లీ త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్ పై దృష్టి సారించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.