
దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 26 పైసలు, డీజిల్ ను లీటర్ కు 34 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయ. తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ,91.53కి చేరగా లీటరు డీజిల్ ధర రూ. 82.06కి పెరిగింది. ఇక ఇతర నగరాల్లో చూస్తే ముంబయిలో పెట్రోలధర రూ. వందకు చేరవుతోంది. ప్రస్తుతం లీటరు ధర రూ. 97.86 గా ఉంది. డీజిల్ ధర రూ. 89.17 కి చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.95.13, లీటర్ డీజిల్ రూ. 89.47కు లభిస్తోంది.