
దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్ సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కు ఇదే చివరి రాజకీయ ప్రసంగంగా భావిస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందని చెప్పారు. అయితే, ఎస్సీలతో పాటు ఎస్టీల కుటుంబాలకూ రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షమే అసెంబ్లీ ఏర్పాటు చేసి దళిత బంధు పథకంపై చర్చించాలన్నారు.