https://oktelugu.com/

Revanth Reddy : అన్నంత పనీ చేసిన రేవంత్ రెడ్డి…సెల్ ఫోన్లకు మేసేజ్ లు.. రైతులకు ఒక్కసారిగా షాక్..

"రైతులను మోసం చేసిండు. కౌలు రైతులను ఆగం చేసిండు. వ్యవసాయం మొత్తం నాశనమైంది. ఒక పంట కూడా సక్కగా పండుతలేదు. కరెంటు 24 గంటల పాటు ఇవ్వడం లేదు. రైతులు రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు" ఇలానే కదా కాంగ్రెస్ ప్రభుత్వం పై భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్నది..

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2024 / 10:22 PM IST

    CM Revanth Reddy(12)

    Follow us on

    Revanth Reddy  : రైతుబంధు కు ఎగనాం పెట్టాడని.. పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వడం లేదని.. రైతులను నిండా ముంచాడని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదలుపెడితే ఈరోజు వరకు భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికలుగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.. అయినప్పటికీ రేవంత్ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు.. రైతుల రుణాల మాఫీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. రైతుల రుణాలు మాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ.. మంత్రులు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.. మీ హయాంలో రైతుల రుణమాఫీ అనేది ఎన్నికల స్టంట్ అని.. మా ప్రభుత్వ హయాంలో నెరవేర్చిన బాధ్యత అని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే ఇవి ఇలా సాగుతుండగానే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. సన్నధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు..

    బోనస్ డబ్బులు జమ

    రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులను జమ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నది. సన్న రకాన్ని చెందిన ధాన్యానికి క్వింటాకు 500 చొప్పున రైతుల ఖాతాలో జమచేస్తోంది. ఈనెల 11న ఒక రైతు ఖాతాలో క్వింటాకు 500 చొప్పున 30,000 ను ప్రయోగాత్మకంగా పౌర సరఫరాల శాఖ జమ చేసింది. శనివారం ఒక కోటికి పైగా చెక్కులను ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జారీ చేసింది. ఇక 48 గంటల్లో బోనస్ తాలూకూ డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలుస్తోంది. “ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నెరవేర్చుతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడాలి. కాలేశ్వరం జలాలు లేకుండానే ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. కోటి ఎకరాలకు మించి వరి సాగయింది. గత రికార్డులను ఈసారి తెలంగాణ బద్దలు కొడుతుంది. ధాన్యం ఉత్పత్తిలో తిరుగులేని స్థాయిలో నిలబడుతుందని” కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు..”మేము రైతుల పక్షాన మాత్రమే పరిపాలన సాగిస్తున్నాం. అంతేతప్ప వారిని ఇబ్బంది పెట్టడం లేదు. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మతే మోసపోతారని.. రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాగా, ప్రభుత్వం సర్కారీ పాఠశాలల విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం, రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం విషయంలో.. సన్న రకాల కే ప్రాధాన్యం ఇవ్వడంతో.. రైతులకు బోనస్ ఇస్తున్నది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు సన్న రకాలను సాగు చేశారు. అయితే ఈసారి వాతావరణం అనుకూలంగా ఉండడంతో రికార్డ్ స్థాయిలో పంట ఉత్పత్తి వస్తోంది.