
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిన గల్లా అరుణకుమారి వేరే ఏదైనా పార్టీలో చేరతారా అన్న ఊహాగానాలకు తెరదింపింది. మీటింగ్‌లకు వెళ్లిరావడం చాల కష్టంగా ఉందని అందుకే రాజీనామా చెయ్యాల్సి వచ్చిందని మరి ఏ ఇతర కారణాలు లేవని ఆమె స్పష్టం చేసింది. ఏ పార్టీ లోకి వెళ్లే అవకాశం లేన్నట్లు తెలుగుదేశం పార్టీ కొనసాగుతానని ఈ సందర్బంగా ఆమె వెల్లడించింది. టీడీపీని పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారని మంచి వారిని పెట్టుకోవటానికి పార్టీ అధినేత చంద్రబాబుకు వెసులుబాటు ఇవ్వాలనే ఉద్దేశంతో పాలిట్‌బ్యూరోకు రాజీనామా చేసినట్లు తెలిపారు.