
గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 432 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు నిధులు విడుదలయ్యాయి. గ్రామ పంచాయీలకు రూ. 182.49 కోట్లు కాగా, మండల పరిషత్ రూ. 124.11 కోట్లు, జిల్లా పరిషత్ లకు రూ. 125.95 కోట్లు విడుదల చేశారు.