
కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే 2-డీజీ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్ లోకి విడుదల చేసింది. ముందుగా 10 వేల సాచెట్లను మార్కెట్ లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2డీజి ఔషదాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే. 2డీజీ మందు పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీంలో వైరస్ సోకిన కణాల్లో కి చేరుకుని ఆ కణాల నుంచి వైరస్ లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది.