
ఏపీలో కర్ప్యూ వేళలను సడలించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జూన్ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు.