
సామాన్యులకు భారీ ఊరట కలిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడిబుల్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 5.5 శాతం తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ఏడాది కాలంగా నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కేంద్రం కట్టడికి చర్యలు చేపట్టింది. క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 30.25 శాతం నుంచి 24.7 శాతానికి, రిఫైన్డ్ పామాయిల్ సుంకం 41.25 శాతం నుంచి 35.75 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.