RCB vs MI: ఐపీఎల్ లో ప్రస్తుతం కీలక సమరాలు జరుగుతున్నాయి. ప్లే ఆఫ్ బెర్త్ ను నిర్దేశించే మ్యాచ్ లు ఊహకందని విధంగా సాగుతూ ఉన్నాయి. దీంతో క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టి20 మజా లభిస్తోంది. ఇప్పటికే గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్ దగ్గరికి వెళ్ళింది. ముంబై ఇండియన్స్ కూడా సాంకేతికంగా ప్లే ఆఫ్ జాబితాలో ఉంది. మరోవైపు బెంగళూరు వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది.
ఐపీఎల్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా బెంగళూరు, ముంబై పోటీ పడుతున్నాయి. గడిచిన రెండు మ్యాచ్లలో ముంబై జట్టు వరుసగా ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో వెనక్కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు చాలా అవసరం. ఈ మ్యాచ్లో గెలిచి ముందుకు వెళ్లాలని బెంగళూరు ప్లేయర్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముంబై జట్టు సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ జాబితాలో ఉంది. అందువల్ల ఆ జట్టుకు ఈ మ్యాచ్లో గెలవడం అత్యంత అవసరం. వేల గనుక ఓడిపోతే అధికారికంగా టోర్నీ నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. అదే గనుక జరిగితే ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోరమైన దెబ్బ తగిలినట్టే. వర్షం కురవకూడదని ముంబై ఇండియన్స్ అభిమానులు భావిస్తున్నారు. శనివారం రాత్రి ఇక్కడ విపరీతంగా వర్షం కురిసింది. దీంతో రెండు జట్లు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం లభించలేదు. ఫలితంగా ప్లేయర్లు హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. ఆదివారం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. మ్యాచ్ ప్రారంభమయ్యే నాటికి చిన్న చిన్న జల్లులు కురుస్తాయని వార్తలు వస్తున్నాయి.
వర్షం అంతరాయం వల్ల మ్యాచ్ గనక రద్దు అయితే.. రెండు జట్లకు ఒక పాయింట్ చొప్పున లభిస్తుంది. అప్పుడు మిగతా మూడు మ్యాచ్లో కనుక ముంబై జట్టు విజయం సాధిస్తే.. కేవలం 13 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పది జట్లు పోటీలో ఉన్నప్పుడు.. కేవలం 13 పాయింట్లు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్ దాకా వెళ్ళిన ఉదంతాలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. ఇక బెంగళూరు, ముంబై ఇప్పటివరకు 35 సార్లు పోటీ పడ్డాయి. బెంగళూరు 16 సార్లు, ముంబై 19సార్లు విజయం సాధించింది. ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో ముంబైలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు గెలిచింది. బెంగళూరు ఇప్పటివరకు ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడింది. ఆరింట్లో గెలిచింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.