
రేషన్ డీలర్ల పై అధికారుల వైఖరీకి నిరసనగా మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్ కి పిలుపు నిచ్చినట్లు ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రాపు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం లోపాలను సరిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో సంగం మంది ఎండీయూలు రేషన్ పంపిణీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని దీనిలో ఉన్న లోపాలను ముఖ్యమంత్రి జగన్ గుర్తించాలని చెప్పారు.