
కరోనా సెకండ్ వేవ్ వేధింపులతో తీవ్రంగా బాధపడుతున్న భారత దేశానికి అదనపు సాయాన్ని వేగంగా అందిస్తామని అమెరికా ప్రకటించింది. భారత్ కు కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లు, ముడి సరుకులు, ప్రాణ రక్షక వైద్య సంబంధిత సరఫరాలను అందజేయాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ కరోనా సమయంలో భారతీయులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.